లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ తర్వాత మిగిలిన అన్ని ఇండస్ట్రీలు కూడా బాగానే కోలుకున్నాయి. టాలీవుడ్ మిగిలిన ఇండస్ట్రీలకు మార్గనిర్దేశకం చేసి అన్నింటి కన్నా ముందు నిలవగా ఇతర ఇండస్ట్రీలు కూడా జోరు చూపాయి, కానీ కోలుకొని ఏకైక ఇండస్ట్రీ బాలీవుడ్ అనే చెప్పాలి. కొన్ని ప్రయత్నాలు చేసినా జనాలు థియేటర్స్ తరలి రాలేదు. ఇక ఇప్పుడు సెకెండ్ వేవ్ కన్నా ముందే థియేటర్స్ ని మళ్ళీ క్లోజ్ చేసిన బాలీవుడ్…
సెకెండ్ తర్వాత ఎలా కోలుకుంటుంది అనేది ఆసక్తిగా మారగా, సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న తొలి పెద్ద బాలీవుడ్ మూవీ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ బెల్ బాటం అని చెప్పొచ్చు. ఈ ఇయర్ అనే కాదు లాస్ట్ ఇయర్ నుండి…
ఇప్పటి వరకు కూడా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మొట్ట మొదటి బిగ్ మూవీ ఇదే అవ్వడం తో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక సినిమా కి డిజిటల్ రిలీజ్ కోసం ఏకంగా 130 కోట్ల రేంజ్ ఆఫర్స్ వచ్చినా కానీ నో చెప్పి థియేటర్స్ లో జులై…
27 న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఎదురుదెబ్బ తగిలింది అని తెలుస్తుంది. తొలి బిగ్ మూవీ అయినా కానీ ఈ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ ఓనర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, అలాగే ఆశించిన రేట్ల కన్నా కూడా చాలా తక్కువ రేట్లు మాత్రమే కోట్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో థియేట్రికల్ బిజినెస్ టీం అనుకున్న విధంగా…
అయితే జరిగే అవకాశం చాలా తక్కువే అని తెలుస్తుంది. రిలీజ్ టైం కి భారీ హైప్ ను సినిమా సొంతం చేసుకుంటే తప్పితే నార్మల్ రేట్లకే సినిమాను అమ్మే అవకాశం ఉందని అంటున్నారు. 130 కోట్ల ఆఫర్ కి సైతం నో చెప్పి రిస్క్ చేస్తున్న అక్షయ్ కుమార్ ఈ సినిమా తో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక.