బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ టాలీవుడ్ లో చల్ల బడింది…. అనుకున్న రేంజ్ లో సినిమాలు రీ రిలీజ్ లలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం పెర్ఫార్మ్ చేయలేక పోతున్నాయి. మరో పక్క తమిళ్ లో రీ రిలీజ్ లో విజయ్ గిల్లి సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. ఇక టాలీవుడ్ లో సడెన్ గా ఒక క్రేజీ సినిమాను…
రీ రిలీజ్ చేస్తున్నారు….సరిగ్గా మూడేళ్ళ క్రితం పీక్ కోవిడ్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్(Vakeel Saab Movie Re Release) బాక్స్ ఆఫీస్ రన్ కేవలం 2 వారాల రేంజ్ కే పరిమితం అయింది…. మంచి రివ్యూలు సొంతం చేసుకున్న ఈ సినిమా…
సమ్మర్ లో మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా కోవిడ్ ఇంపాక్ట్ వలన దెబ్బ పడి టోటల్ రన్ లో 83.36 కోట్ల షేర్ ని 138 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకుంది… కానీ తర్వాత టెలివిజన్ లో చూసిన ప్రతీ ఒక్కరు థియేటర్స్ లో లాంగ్ రన్ ఉండే సినిమాల్లో ఈ సినిమా ఒకటి అని అనుకున్నారు.
అలాంటి ఈ సినిమాను ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రీ రిలీజ్ చేస్తున్నారు. సడెన్ సర్ప్రైజ్ చేస్తూ మే 1న సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది… పెద్దగా కొత్త సినిమాలు ఏమి లేక పోవడం, సమ్మర్ మొత్తం చప్పగా సాగుతూ ఉండటంతో ఈ టైంలో వకీల్ సాబ్ ను అప్పట్లో మిస్ అయిన వాళ్ళు…
ఇప్పుడు థియేటర్స్ లో మరోసారి చూసే అవకాశం ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు….స్వయంగా అఫీషియల్ ప్రొడ్యూసర్స్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో తమ థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా డీసెంట్ ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తే బాక్స్ అఫీస్ దగ్గర ఎంతో కొంత ఫుట్ ఫాల్స్ ను వకీల్ సాబ్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.