సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రీసెంట్ గా దీపావళి వీకెండ్ లో రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది, మాస్ కంటెంట్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతుంది అని అంతా అనుకున్నారు కానీ మొదటి రోజు నుండే అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా ఏ దశలో కూడా…..
టార్గెట్ ను అందుకునే దిశగా అడుగులు వేయలేదు, సినిమాను 650 వరకు థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయగా సినిమా మూడు రోజుల తర్వాత 4 వ రోజు కొంచం గ్రోత్ ని చూపెట్టి 52 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర…
దాంతో టోటల్ గా సినిమా 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 1.16Cr
👉Ceeded: 54L
👉UA: 32L
👉East: 22L
👉West: 18L
👉Guntur: 36L
👉Krishna: 21L
👉Nellore: 17L
AP-TG Total:- 3.16CR(5.40CR~ Gross)
సినిమా మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఇది…
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Tamil Nadu : 76.70cr (42.5cr)
Karnataka : 7.51cr (3.95cr)
AP/TS : 5.40cr (3.16cr)
Kerala : 2.1cr (1.05cr)
Rest of India : 3cr (1.5cr)
Total India: 94.71CR(52.16Cr)
Overseas – 25.4Cr(12.4Cr)***
Total WW: 120.11CR(64.56CR Share)
ఇదీ సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క…
తమిళ్ వర్షన్ ని మేకర్స్ ఆల్ మోస్ట్ ఎన్ని ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేయగా తెలుగు లో మాత్రం సినిమాను 12.5 కోట్ల రేటు కి అమ్మారు, దాంతో మినిమమ్ 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 9.84 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…