కోలివుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో మెంటల్ మాస్ జాతర సృష్టిస్తూ దూసుకు పోతున్న శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా, రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయినా కూడా అన్ని చోట్లా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపెడుతూ లాభాలను స్టడీగా పెంచుకుంటూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. సినిమా ఊపు చూస్తూ కొత్త సినిమాలు పోటిలో ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో ఇప్పుడు 300 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం కనిపిస్తుంది సినిమాకి.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 6.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ హోల్డ్ ని చూపించింది.
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 13 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 8.50Cr~
👉Ceeded: 2.58Cr~
👉Andhra: 7.24Cr~
AP-TG Total:- 18.32CR(31.40Cr~ Gross)
5.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 12.82 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతుంది.
ఇక 13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 13 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 122.75Cr
👉Telugu States – 31.40Cr
👉Karnataka – 17.65Cr
👉Kerala – 9.20Cr
👉ROI – 2.40Cr
👉Overseas – 74.25Cr***approx
Total WW collection – 257.65CR(127.10CR~ Share) Approx
మొత్తం మీద 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 60.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.