టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వీకెండ్ లో దుమ్ము లేపే వసూళ్ళ ని సాధించింది, సినిమా 12 రోజుల్లో 135 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా రెండు తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల హిస్టారికల్ షేర్ మార్క్ ని అందుకున్న సైరా ఇప్పుడు రెండో వీక్ లో వర్కింగ్ డేస్ లో పోటి ని మళ్ళీ మొదలు పెట్టింది.
13 వ రోజు పక్కా వర్కింగ్ డే అవ్వడం తో సినిమా భారీ షాక్ నే ఇచ్చింది. 12 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 2.98 కోట్ల షేర్ ని అందుకోగా ఆ కలెక్షన్స్ తో పోల్చితే సినిమా 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 60% కి పైగా….
డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలతో పోల్చితే ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కేవలం 5% వరకు గ్రోత్ మాత్రమె కనిపించింది, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా మరీ స్టడీ గా అయితే లేవని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తె…
సినిమా 13 వ రోజు మొత్తం మీద 1.3 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటేనే సాధ్యం అని చెప్పాలి, అదే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ ఉంటె..
సినిమా మొత్తం మీద 1.5 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక మిగిలిన చోట్ల సినిమా కి హిస్టారికల్ లాస్ లు ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యాయి అనే చెప్పాలి. ఆ ఏరియాలలో లాస్ లను ఇప్పుడు సైరా రెండు తెలుగు రాష్ట్రాలలోనే రికవరీ చేయాల్సి ఉంటుంది. ఇక 13 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.