Home న్యూస్ వీళ్ళెం ఫ్యాన్స్ అండి బాబు…రికార్డుల బెండు తీశారు!

వీళ్ళెం ఫ్యాన్స్ అండి బాబు…రికార్డుల బెండు తీశారు!

0

     సోషల్ మీడియా రికార్డులు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ గా మారాయి… మన టాలీవుడ్ వరకు హీరోల ఫస్ట్ లుక్స్ నుండి టీసర్ లు ట్రైలర్ ల విషయం లో పోటి తీవ్రంగానే ఉండగా కొత్త రికార్డులు హీరోల ఫ్యాన్స్ ప్రతీ సినిమా విషయం లో మార్చుతూ ఆధిపత్యం మారుతూ పోతుంది. కానీ పక్క ఇండస్ట్రీ కోలివుడ్ లో మాత్రం సోషల్ మీడియా రికార్డులు అంటే ఇలయ దళపతి విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.

విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ టీసర్లు ట్రైలర్ ల విషయం లో ఎవ్వరూ అందుకోలేని రికార్డ్ లను నమోదు చేస్తూ మిగిలిన హీరోల ఫ్యాన్స్ కి చాలా కష్టమైనా టార్గెట్స్ ఇస్తున్నారు. వాళ్ళు బ్రేక్ చేసే లోపే మళ్ళీ వీళ్ళే సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతున్నారు.

రీసెంట్ టైం లో విజయ్ ఫ్యాన్స్ కి అజిత్ ఫ్యాన్స్ కి మధ్య పోటి మరింత పెరగగా సోషల్ మీడియా రికార్డ్ ల విషయం లో మాత్రం ప్రస్తుతానికి విజయ్ ఫ్యాన్స్ టాప్ లేపుతున్నారు అని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ విజయ్ బిగిల్ ట్రైలర్ కి తొలి 24 గంటల్లో ఊహకందని రికార్డులు దక్కాయి.

ఫస్ట్ 24 గంటల్లో ఏకంగా 18.3 మిలియన్ వ్యూస్ ని 1.66 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశారు. మన ట్రైలర్స్ లో ఒక్క ట్రైలర్ కూడా 1 మిలియన్ ని అందుకోలేదు. కానీ వీళ్ళు ఏకంగా ఇప్పుడు 2 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్నారు.

ఇండియా లోనే మోస్ట్ లైకుడ్ ట్రైలర్ గా బిగిల్ ని నిలిపారు. ఈ రికార్డులు చూసి ఇతర ఇండస్ట్రీ ఫ్యాన్స్ వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు అని అనుకుంటున్నారు. ఈ యూట్యూబ్ రికార్డులలో దుమ్ము లేపిన ఈ ఫ్యాన్స్ హీరోల పుట్టిన రోజు ట్రెండ్స్ లో మాత్రం మన హీరోల ఫ్యాన్స్ తో ఎప్పుడూ ఓడిపోతూ ఉండటం మాత్రం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here