మొదటి వారాన్ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న బేబి మూవీ(Baby Movie) రెండో వారంలో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుని వీకెండ్ లో కలెక్షన్స్ వీర విహారం చేయగా వర్కింగ్ డేస్ లో వర్షాలు ఇబ్బంది పెడుతున్నా కూడా ఊరమాస్ హోల్డ్ ని…
చూపిస్తూ దూసుకు పోతున్న బేబి మూవీ 12 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని రచ్చ చేయగా 13వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది…
సినిమా 12వ రోజుతో పోల్చితే 13వ రోజు మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో 15-20% రేంజ్ లో డ్రాప్స్ కనిపించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే విధంగా ఉంటే సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 90 లక్షల నుండి 95 లక్షల రేంజ్ లో…
షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా మొత్తం మీద 1 కోటి రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…
మొత్తం మీద మిగిలిన రోజుల మాదిరిగా సినిమా మరోసారి అంచనాలను మించి కోటి రేంజ్ లో షేర్ ని అందుకుంటే 13 రోజులు నాన్ స్టాప్ గా కోటికి తగ్గని షేర్ తో తెలుగు రాష్ట్రాల్లో 2023 ఇయర్ లో రికార్డ్ ను అందుకునే అవకాశం ఉంటుంది. ఇక టోటల్ 13 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.