బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి2898AD(Kalki2898AD Movie) రెండో వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకుంది….అయినా ఆల్ రెడీ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకుని…
లాభాల పరంగా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా డ్రాప్స్ ఉన్నా కూడా ఇక మీదట వచ్చేవన్నీ బోనస్ అని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు వర్కింగ్ డే వలన మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో ఇప్పుడు 1.2 కోట్ల రేంజ్ నుండి 1.4 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో స్టడీగా జోరు చూపిస్తున్న సినిమా ఈ రోజు అక్కడ 5 కోట్లకు అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాలు అన్నీ కలిపి సినిమా 1 కోటి రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ఈ రోజు మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ ఉండగా మొత్తం మీద ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి ఇప్పుడు…
వరల్డ్ వైడ్ గా 13 రోజున 6-6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు 13 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…