బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన సినిమా స్లో డౌన్ అయింది. అనుకున్న దాని కన్నా కూడా 12వ రోజు సినిమా ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.
ఇక 13వ రోజుకి వచ్చే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగుతో పోల్చితే హిందీలో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది. మిగిలిన చోట్ల సినిమా మరింతగా స్లో అయింది ఇప్పుడు… ఉన్నంతలో ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో….
13వ రోజున అటూ ఇటూగా 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 80 లక్షల మార్క్ ని టచ్ చేయోచ్చు. ఇక హిందీలో ఈ రోజు సినిమా 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…
మొత్తం మీద 13వ రోజు వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.