Home న్యూస్ సలార్ కాదు-దేవర కాదు…పుష్ప2 కాదు…..లక్కీ భాస్కర్ దే అసలు రికార్డ్!!

సలార్ కాదు-దేవర కాదు…పుష్ప2 కాదు…..లక్కీ భాస్కర్ దే అసలు రికార్డ్!!

0

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఎదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంటుంది. మా సినిమా గొప్ప…లేదు మా సినిమా గొప్ప అంటూ అనుకుంటూ ఉంటారు…లాస్ట్ ఏడాది టైంలో రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో సోషల్ మీడియాలో ఎక్కువ సార్లు కనిపించిన సినిమాల సీన్స్ విషయంలో సలార్ కానీ దేవర కానీ పుష్ప2 కానీ అలాగే గుంటూరు కారం….

ఇలా కొన్ని సినిమాల సీన్స్ అండ్ సాంగ్స్ లాంటివి సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయ్యాయి. అలాగే డిజిటల్ రిలీజ్ లో మా సినిమాలే సాలిడ్ వ్యూవర్ షిప్ ను కూడా సొంతం చేసుకున్నాయి అంటూ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు… కానీ ఇప్పుడు అందరినీ ఆశ్యర్యపరుస్తూ పైన చెప్పిన ఏ సినిమాలు కూడా..

డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత అల్టిమేట్ రికార్డులు ఏమి క్రియేట్ చేయలేదు. నెట్ ఫ్లిక్స్ లాంటి మోస్ట్ పాపులర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన సలార్, దేవర, పుష్ప2 తో పాటు ఇతర బిగ్ మూవీస్ అన్నీ కూడా రిలీజ్ అయిన కొన్ని వారాల పాటు టాప్ ప్లేసులలో ట్రెండ్ అయ్యాయి కానీ…

ఈ సినిమాలను అన్నీ మించి పోయే రేంజ్ లో లాస్ట్ ఇయర్ దీపావళికి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మే హిట్ అయిన దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ సౌత్ మూవీస్ పరంగా నెట్ ఫ్లిక్స్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది…

ఏకంగా 13 వారాల పాటు నాన్ స్టాప్ గా ప్రతీ వారం టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలిచి ఈ సినిమా సౌత్ మూవీస్ పరంగా ఇలా హైయెస్ట్ వ్యూవర్ షిప్ తో అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఏకంగా 17.8 బిలియన్ వన్ మినట్ వాట్చ్ టైం ఈ సినిమా కి సొంతం అయినట్లు సమాచారం.

దాంతో ఎవరి హీరోల ఫ్యాన్స్ వాళ్ళు మా సినిమా తోపు..ఎక్కువ వ్యూస్ వచ్చాయి అంటూ అనుకుంటూ ఉండగా అందరినీ ఆశ్యర్యపరుస్తూ లక్కీ భాస్కర్ మూవీ అసలు సిసలు విన్నర్ గా నిలిచి…పెర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ కి మించిన విన్నర్ మరోటి ఉండదని నిరూపించింది ఇప్పుడు.

Lucky Baskhar Movie 6 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here