బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా భారీ సక్సెస్ ను సాధించిన తర్వాత ….చేసే కొత్త సినిమాలకు మంచి ఊపు రావడం కామన్, కానీ ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ హిట్ ను సొంతం చేసుకున్న తర్వాత చేసిన సినిమా కి భారీగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ రావడం అనేది మాత్రం ఎవ్వరూ ఊహించలేదు అనే చెప్పాలి.
ఇప్పుడు ఇదే జరిగింది నాచురల్ స్టార్ నాని(Nani)కి…. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ దసరా సినిమా(Dasara Movie) తో సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్న నాని ఆ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అలాగే మీడియం రేంజ్ హీరోలలో రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు…
కానీ ఆ ఇంపాక్ట్ ఏమి కూడా నాని నటించిన కొత్త సినిమా హాయ్ నాన్న పై పడలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది. మొదటి రోజే 2.9 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకోగా దసరా ఓపెనింగ్స్ 14.22 కోట్ల రేంజ్ లో ఉండగా రెండు సినిమాల మధ్య ఓపెనింగ్స్ డిఫెరెన్స్ ఇప్పుడు…
11.32 కోట్ల దాకా ఉండటం ఏ రేంజ్ లో హాయ్ నాన్నకి ఎఫెక్ట్ గా నిలిచిందో అర్ధం చేసుకోవచ్చు… మొత్తం మీద దసరా ఊరమాస్ మూవీ అలాగే హాయ్ నాన్న అల్ట్రా క్లాస్ ఎమోషనల్ మూవీ…రెండు సినిమాల జానర్ లకు భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ ఓ భారీ మాస్ హిట్ తర్వాత ఇలాంటి ఓపెనింగ్స్ మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.