బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 వారాలను పూర్తీ చేసుకుంది, సినిమా రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించిన తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం స్లో డౌన్ అవ్వక తప్పలేదు. అయినా కానీ పుష్ప రెండో వీక్ వర్కింగ్ డేస్ కలెక్షన్స్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా వర్కింగ్ డేస్….
కలెక్షన్స్ కి ఆల్ మోస్ట్ ఈక్వల్ గా రావడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 28 లక్షల దాకా షేర్ ని అందుకోగా, హిందీలో 46 కోట్ల నెట్ మార్క్ ని అధిగమించింది. ఓవర్సీస్ లో 2.25 మార్క్ ని అందుకుంది.
కన్నడలో, తమిళ్ లో మలయాళంలో ఇలా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించిన సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రలో మాత్రం విపరీతమైన నష్టాలను సొంతం చేసుకుంది అక్కడున్న టికెట్ రేట్స్ కారణంగా, ఓవరాల్ గా సినిమా 2 వారాల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 38.45Cr(Without GST 35.40Cr)
👉Ceeded: 13.37Cr
👉UA: 7.34Cr
👉East: 4.50Cr
👉West: 3.70Cr
👉Guntur: 4.75Cr
👉Krishna: 3.90Cr
👉Nellore: 2.89Cr
AP-TG Total:- 78.90CR(122.18CR~ Gross)
👉Karnataka: 10.35Cr
👉Tamilnadu: 8.51Cr
👉Kerala: 4.67Cr
👉Hindi: 22.40Cr
👉ROI: 2.15Cr
👉OS – 12.72Cr
Total WW: 139.70CR(248CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క.
మొత్తం మీద సినిమాను 144.9 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. దాంతో సినిమా మొత్తం మీద 2 వారాల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 6.30 కోట్ల దూరంలో ఉందని చెప్పాలి. మూడో వీక్ లో సినిమా ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మూడో వీకెండ్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.