బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) లాస్ట్ ఇయర్ దాస్ కా ధమ్కీ ఈ ఇయర్ గామి లాంటి సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకుని కెరీర్ బెస్ట్ హిట్ అండ్ కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు త్వరలో..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమాతో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మే నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఈ సినిమానే మేజర్ హాట్ ఫేవరేట్ మూవీ అని చెప్పాలి. టాక్ ఏమాత్రం బాగున్నా మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక సినిమా మీద మంచి క్రేజ్ ఉండటం అలాగే విశ్వక్ సేన్ కూడా వరుస హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండటంతో ఈ సినిమా బిజినెస్ పరంగా మంచి జోరుని చూపెడుతూ ఉండగా రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే డిజిటల్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడు అయ్యి సంచలనం సృష్టించింది…
విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఆల్ మోస్ట్ 14 కోట్ల రేంజ్ లో రేటు ని చెల్లించు హక్కులను సొంతం చేసుకున్నారట. విశ్వక్ సేన్ కెరీర్ లో ఇది రికార్డ్ కాగా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి బడ్జెట్ మొత్తం కూడా రికవరీ అయ్యిందన్న టాక్ ఉంది….
ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగే అవకాశం ఎంతైనా ఉండగా ఇక సినిమా ఈ నెల 17న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండటంతో టాక్ ఏమాత్రం బాగున్నా కూడా మరో హిట్ ని విశ్వక్ సేన్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.