బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ 13వ రోజు కొంచం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు లో అడుగు పెట్టగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మరో వర్కింగ్ డే ఎఫెక్ట్ తో మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి…
తెలుగు రాష్ట్రాలలో 13 వ రోజు తో పోల్చితే మరోసారి 30-35% వరకు డ్రాప్ అయిన ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు 14 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలిపి…
ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు, ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి 14 వ రోజు వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా ఏమైనా గ్రోత్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించే అవకాశం ఉందో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం…