బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రెండో వీక్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా రిలీజ్ అయిన 14వ రోజున…
కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా దేవర బుకింగ్స్ పరంగా మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం. ఒక దశలో సినిమా బుకింగ్స్ కొత్త సినిమాల కన్నా బెటర్ గా ట్రెండ్ అవ్వగా ఓవరాల్ గా సినిమా 14వ రోజు బుకింగ్స్ ట్రెండ్ మొత్తం మీద…
13వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం కాగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 1.4 కోట్ల కి పైగానే షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు నైజాంలో….
బతుకమ్మ పండగ వలన కొంచం డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో మంచి హోల్డ్ వలన మరోసారి 1.5-1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక హిందీలో సినిమా ఈ రోజు కోటి రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని దాటే అవకాశం ఉండగా….
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా కొత్త సినిమాల వలన ఎఫెక్ట్ ఉన్నా ఓవరాల్ గా 30-35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా 14వ రోజున వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు…..2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 2 వారాల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.