ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు పూర్తి ఫామ్ ని కోల్పోయి వరుస డిసాస్టర్ మూవీస్ తో కెరీర్ లో లోవేస్ట్ ఫేజ్ లో ఉన్న టైంలో బాలయ్య కెరీర్ కి తిరిగి ఊపిరి పోసిన సినిమాగా చెప్పుకునే సినిమా సింహా(Simha 2010 Movie)…. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో…
తెరకెక్కిన సినిమానే అయినా రిలీజ్ కి ముందు కూడా బాలయ్యకి కంబ్యాక్ మూవీ అవుతుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. కెరీర్ లో వేస్ట్ స్టేజ్ నుండి ఏకంగా తెలుగు సినిమాల పరంగా ఆ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకున్న టాలీవుడ్ మూవీగా రికార్డ్ కొట్టింది ఈ సినిమా….అలాంటి సింహా సినిమా రిలీజ్ అయ్యి రీసెంట్ గా 14 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం విశేషం….96 సెంటర్స్ లో 100 డేస్ ను కంప్లీట్ చేసుకుని 175 రోజులు కంప్లీట్ చేసుకుని బాలయ్యకి ఎపిక్ కంబ్యాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమా…
అప్పట్లో 16 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 32 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని 16 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బిజినెస్ మీద ఆల్ మోస్ట్ డబుల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని ఈ సినిమా సంచలనం సృష్టించింది…
బాలయ్యకి తిరుగు లేని కంబ్యాక్ ఇచ్చిన ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమాలు అంటే ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ తిరిగి ఏర్పడేలా చేసింది…. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు కంప్లీట్ అవ్వగా బాలయ్య బోయపాటి ల కాంబోలో ఈ సినిమాతో కలిపి హాట్రిక్ విజయాలు నమోదు అవ్వగా త్వరలో మరోసారి వీళ్ళ కాంబోలో కొత్త సినిమా ఉండబోతుంది.