ఒక్క సినిమాతో ఆల్ ఇండియా లో క్రేజ్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు… KGF సినిమా తో తెలుగు లో విపరీతంగా క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలవగా తెలుగు లో యష్ మూవీస్ కి క్రేజ్ బాగా ఏర్పడింది, కానీ ఎందుకనో యష్ నటించిన కన్నడ సినిమాలు పెద్దగా తెలుగు లో డబ్ చేయలేదు, కానీ రీసెంట్ గా యష్ నటించిన కన్నడ మూవీ గజకేసరి అదే పేరు తో తెలుగు లో…
డబ్ చేసి సెకెండ్ వేవ్ రాకముందు రిలీజ్ చేశారు, మగధీర స్టైల్ లో పునర్జన్మల కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తెలుగు లో పెద్దగా ప్రచారాలు లాంటివి చేయకున్నా డీసెంట్ థియేటర్స్ కౌంట్ తో రిలీజ్ అయింది, ఆల్ మోస్ట్ 150 వరకు థియేటర్స్ లో ఈ సినిమా తెలుగు లో రిలీజ్ ను…
సొంతం చేసుకోవడం విశేషం, కానీ ఆ టైం లో పోటి తీవ్రంగా ఉండటం తో…. కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశనే మిగిలించింది ఈ సినిమా, ఈ సినిమా తెలుగు రైట్స్ ని సుమారు 15 లక్షలకు కొన్నారని సమాచారం. థియేట్రికల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ని మొదటి రోజుల్లో సొంతం చేసుకుంది.
దానికి కారణం పోటి తీవ్రంగా ఉండటం తో జనాలు ఏ సినిమా కి వెళ్ళాలో అన్న క్లారిటీ లేకుండా పోయింది, దాంతో ఈ సినిమా ను కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఆ ఎఫెక్ట్ వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగగా సినిమా కి షేర్స్ ఏమి రావడం లేదు. దాంతో నష్టనలే మిగిలించే విధంగా సినిమా మొత్తం మీద 6-7 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర…
సొంతం చేసుకుందని సమాచారం..అవి కూడా డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ని తీయకుండా చెప్పిన లెక్కగా చెప్పుకోవాలి, దాంతో 15 లక్షలకు కొన్న నిర్మాతకి నష్టాలు కన్ఫాం అవ్వగా సినిమా ఇక శాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాతకి రికవరీ అయ్యి ఓవరాల్ గా నిర్మాత సేఫ్ అయ్యాడు. కొంచం కరెక్ట్ టైం చూసుకుని రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకొంచం బెటర్ గా ఉండేదేమో…