బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు ఏమాత్రం కన్సిడర్ చేయరు, సినిమా బడ్జెట్ ఎంత?, బిజినెస్ ఎంత చేసింది? ఫైనల్ గా ఎంత రికవరీ చేసింది అన్నది మాత్రం కౌంట్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి పూర్తిగా భిన్నమైనది అన్న విషయం అందరికీ. కరోనా వరల్డ్ వైడ్ గా రెచ్చి పోతున్న వేల మార్చ్ నుండి థియేటర్స్ అన్నీ మూసేసి ఉన్న వేల వరల్డ్ లోనే ఫేమస్ డైరెక్టర్ దర్శకత్వంలో భారీ హైప్ తో…
రూపొందిన సినిమా థియేటర్స్ రీ ఓపెన్ చేసిన దేశాలలో డేర్ చేసి రిలీజ్ చేయగా కలెక్షన్స్ సాలిడ్ గా వస్తున్నా కానీ ఓవరాల్ గా బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం అంచనాలను అందుకోలేదనే అంటున్నారు. ఆ సినిమానే క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన టెనెట్ మూవీ.
ఆగస్టు లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన ఈ సినిమా లాస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా 207 మిలియన్ డాలర్స్ ని వసూల్ చేసింది, అంటే మన కరెన్సీ లో చెప్పాలి అంటే 1500 కు పైగా కోట్లు కలెక్ట్ చేసింది, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వబోతుంది అంటున్నారు.
సినిమాను మొత్తం మీద 200 మిలియన్ డాలర్స్ తో నిర్మించారట. సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 500 మిలియన్ డాలర్స్ దాకా వసూల్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుందని సమాచారం. లాస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ గా 37.3 మిలియన్ డాలర్స్ దాకా వసూల్ చేసిందట. ఇక లాంగ్ రన్ కంప్లీట్ అయ్యే సరికి…
సినిమా 400 మిలియన్స్ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్నీ బాగుంటే సినిమా 1 బిలియన్ డాలర్స్ అవలీలగా అందుకునే సినిమా అని పరిస్థితుల వలన ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగా మారిందని అంటున్నారు, అదే సమయం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం చాలా గొప్ప విషయం అని కూడా చెబుతున్నారు.