Home న్యూస్ టెనెట్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన గాడ్జిల్లా V కాంగ్….ఇదే ఇక నంబర్ 1

టెనెట్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన గాడ్జిల్లా V కాంగ్….ఇదే ఇక నంబర్ 1

1757
0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ తర్వాత వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ సెటిల్ అవ్వడానికి ఇంకా టైం పట్టేలా ఉంది, ఇప్పటికీ ఓవర్సీస్ లో థియేటర్స్ లో ఆక్యుపెన్సీ తక్కువగానే ఉండగా చాలా బిగ్ మూవీస్ మాత్రం ఇప్పటికీ థియేటర్స్ లో కన్నా డిజిటల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నాయి. రీసెంట్ గా థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో కూడా ఒకేసారి రిలీజ్ అయిన సినిమా గాడ్జిల్లా V కాంగ్….

ఇండియా లో దుమ్ము లేపే కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా రిలీజ్ అయిన అన్ని చోట్లా సూపర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది… చైనా లో భారీ వసూళ్లు కురిపించిన ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…

వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన టెనెట్ మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి పాండమిక్ లో నంబర్ 1 మూవీ గా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచింది..

వరల్డ్ వైడ్ గా పరుగు కంప్లీట్ అయ్యే టైం కి క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన టెనెట్ మూవీ 365 మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేయగా ఆ కలెక్షన్స్ రికార్డ్ ను ఇప్పుడు గాడ్జిల్లా V కాంగ్ బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా టోటల్ గా 390 మిలియన్ డాలర్స్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

దాంతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా టాప్ లో నిలవగా ఇండియా లో కూడా ఈ సినిమా ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని హిందీ మూవీస్ కన్నా కూడా చాలా బెటర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక వరల్డ్ వైడ్ టోటల్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here