బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ అన్ని ఇండస్ట్రీలతో పోల్చితే ఫస్టాఫ్ లో మిగిలిన ఇండస్ట్రీలు హిట్స్ కోసం చాలా కష్టపడుతున్న టైంలో ఒక్క ఇండస్ట్రీ నుండి మాత్రం బాక్ టు బాక్ భారీ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి..ఆ ఇండస్ట్రీనే మలయాళ ఇండస్ట్రీ…ఈ ఇయర్ మొదట్లో భారీ లెవల్ లో హిట్స్ కొట్టిన మలయాళంలో ఊహకందని రేంజ్ లో….
మాస్ రాంపెజ్ ను చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 150 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఆవేశం(Aavesham Movie Telugu Remake) సెన్సేషనల్ హిట్ గా నిలిచింది…
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత డిజిటల్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఇతర భాషల్లో సినిమా డిజిటల్ రిలీజ్ ఏమి అవ్వలేదు…సినిమా చూసిన తర్వాత చాలా మంది…
రీమేక్ మెటీరియల్ అంటూ అనుకోగా ఇప్పుడు సినిమా తెలుగు రీమేక్ కి టైం వచ్చింది అన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. సినిమా రీమేక్ రైట్స్ కోసం పోటి ఏర్పడినా కూడా ఫైనల్ గా ఇప్పుడు సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ప్రజెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న…
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) దగ్గరకి ఈ రీమేక్ వచ్చింది అన్నది లేటెస్ట్ టాక్. రవితేజ తన బ్యానర్ నుండి ఈ సినిమా రైట్స్ ను కొన్నాడని సమాచారం. ఆవేశం సినిమా చూసినప్పుడు తెలుగులో ఈ సినిమా బాలయ్య(Balakrishna) రవితేజలలో ఒకరికి సెట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు…
ఇప్పుడు అనుకున్నట్లే సినిమా తెలుగు రీమేక్ రైట్స్ రవితేజ దగ్గరకి వెళ్ళడంతో ఫ్యాన్స్ ఈ విషయంపై ఫుల్ హ్యాప్పీగా ఉన్నారు…కరెక్ట్ గా తెలుగు నేటివిటీకి తగ్గట్లు సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తే రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…