సినిమా బడ్జెట్ ని బట్టి సినిమా పై క్రేజ్ మరింత పెరుగుతుంది, భారీ బడ్జెట్ మూవీ అనే సరికి సహజంగానే సినిమా పై మొదటి ఇంప్రెషన్ పడగా, తర్వాత రిలీజ్ అయ్యే టీసర్ ట్రైలర్ తో ఆ క్రేజ్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది, రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ కి రిలీజ్ కి ముందు నుండే కొంచం హైప్ ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత చాలా మంది…
సినిమాను ఇతర సినిమాలతో పోల్చడం లేదా… ఆ సినిమా వరకు ట్రైలర్ బాగుంది అంటూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, కానీ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ చూసి టోటల్ ఇండస్ట్రీ కూడా షాక్ కి గురి అవుతుంది.
ఆ సినిమానే అర్జున్ కపూర్ సంజయ్ దత్ ల కాంబో లో జోదా అక్బర్ డైరెక్టర్ ఆశుశోత్ గోవారికర్ తెరకక్కించిన పానిపత్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వచ్చిన భాజీరావ్ మస్తానీ ని పోలి ఉందని చాలా మంది విమర్శించినా ట్రైలర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది.
కానీ సినిమా బడ్జెట్ అలాగే పబ్లిసిటీ ఖర్చులతో 150 కోట్లు అవ్వడం శాటిలైట్, స్ట్రీమింగ్ అండ్ మ్యూజిక్ రైట్స్ తో 100 కోట్లు రికవరీ అయినా మిగిలిన 50 కోట్ల రికవరీ కి సినిమా 95 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగి రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా… ఇప్పటి వరకు వచ్చిన మొత్తం అందరికీ షాక్ ఇచ్చింది.
రిలీజ్ అయిన 5 రోజుల్లో కేవలం 22.5 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఏమాత్రం గ్రోత్ లేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు భారీ డిసాస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. దాంతో 150 కోట్ల సినిమా అంటూ ఎంత గొప్పగా చెప్పుకున్నా హీరో ట్రాక్ రికార్డ్ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చూసి ఆడియన్స్ థియేటర్స్ కి రాక పోవడంతో ఇప్పుడు డిసాస్టర్ వైపు అడుగులు వేస్తుంది ఈ సినిమా.