భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు అన్నీ బాహుబలి రేంజ్ లో హిట్లు కావు అని మరో సారి రుజువు అయింది, ప్రతీ ఇండస్ట్రీ లో భారీ బడ్జెట్ లతో సినిమాలు తీయడం అనేది కామన్ అవ్వగా జనాలు కూడా వాటికి అలవాటు పడి భారీ బడ్జెట్ అని ఎగబడి వెళ్ళడం లేదు, మంచి సినిమా నా కాదా అని తెలుసుకున్నాకే థియేటర్స్ కి వెళుతున్నారు. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ వలన…
మరో సినిమా బొక్క బోర్లా పడింది. హీరోగా కొన్ని హిట్స్ కొట్టినా ఆడియన్స్ లో మంచి ఇంప్రెషన్ ని దక్కించుకొని అర్జున్ కపూర్ ని నమ్ముకుని ఏకంగా 150 కోట్ల దాకా ఖర్చు చేసి తీసిన సినిమా పానిపత్. చరిత్ర లో నిలిచిన పానిపత్ యుద్ధం గురించి తెరకెక్కిన ఈ సినిమా..
స్టార్ కాస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ లోకేషన్స్ అన్నీ అద్బుతంగా ఉన్నా సినిమా చాలా స్లో గా ఉందటమ్ తో ఆడియన్స్ అసలు థియేటర్స్ వైపు కూడా వెళ్ళలేదు, దాంతో 95 కోట్ల నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు పట్టుమని 26 కోట్ల నెట్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేదు.
దాంతో ఫైనల్ రన్ లో 30 కోట్ల నుండి మహా అయితే 32 కోట్ల దాకా కలెక్షన్స్ తోనే పరుగును ఆపెస్తుందని అంటున్నారు. ఆ లెక్కన సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర అవలీలగా 63 కోట్ల నుండి 65 కోట్ల రేంజ్ లో లాస్ కన్ఫాం అని అంటున్నారు. దాంతో బాలీవుడ్ హిస్టరీ లో నే ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.
లగాన్, జోదా అక్బర్ లాంటి క్లాసిక్ మూవీస్ తీసిన డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ నుండి ఈ మధ్య కాలం లో ఒక్కకటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. ఈ సినిమా తో తిరిగి కంబ్యాక్ చేయాలని భావించినా ఈ సినిమా కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాఫ్ అవ్వడం తో ఇక ఎప్పుడు హిట్ కొడతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.