Home గాసిప్స్ బాలయ్య-బోయపాటి మూవీ లో విలన్ ఎవరో తెలుసా??

బాలయ్య-బోయపాటి మూవీ లో విలన్ ఎవరో తెలుసా??

0

    నట సింహం నందమూరి బాలకృష్ణ జోరు మీదున్నాడు, ఈ ఇయర్ మొదట్లో ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ భారీ ఫ్లాఫ్ తో డీలా పడినా కానీ తర్వాత తేరుకుని వరుసగా సినిమాలు కమిట్ అవుతూ దూసుకు పోతున్నాడు, ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రూలర్ ఈ నెల 20 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో చేయబోతున్నాడు.

వీళ్ళ కాంబినేషన్ లో ఇది వరకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా అవ్వడం తో ముందు లో బడ్జెట్ లో సినిమా అనుకున్నా ఇప్పుడు బడ్జెట్ పెరిగి పోతూ ఇది క్రేజీ ప్రాజెక్ట్ కాబోతుంది.

ముందుగా సినిమా బడ్జెట్ పెంచి ఇప్పుడు 40 కోట్లకు తగ్గకుండా సినిమా కి ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. ఇక బాలయ్య పవర్ రోల్ కి విలన్ గా ఎవరు సెట్ అవుతారా అని వెతుకుతూ ఉండగా టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి ఇప్పుడు ముఖ్యమైన రోల్స్ వేస్తున్న శ్రీకాంత్ ని విలన్ గా తీసుకోబోతున్నారట.

విలన్ గా కూడా శ్రీకాంత్ అడపాదడపా సినిమాలు చేసినా పవర్ ఫుల్ రోల్ ఇప్పటి వరకు దొరకలేదు, బోయపాటి మూవీ అంటే విలన్ రోల్ ఏ రేంజ్ లో ఎలివేట్ అవుతుందో లెజెండ్ లో జగపతిబాబు రోల్ తో చూపించాడు బోయపాటి, ఇప్పుడు డానికి మించి శ్రీకాంత్ రోల్ ఉంటుంది అనేది ఇండస్ట్రీ టాక్.

ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా, హీరోయిన్స్ గా కేతరిన్ తెస్రా మరియు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ని అనుకుంటున్నారట. చూస్తుంటే స్టార్ కాస్ట్ భారీ గా ఉండేలా ఉందని చెప్పాలి. ఇక సినిమా చకచకా షూటింగ్ జరుపుకుని 2020 సమ్మర్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలనే ఆలోచన లో ఉన్నారని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here