బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ఒకరు, అప్పట్లో రాక్షసుడు సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న బెల్లంకొండ తర్వాత చేసిన సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ ను ఇవ్వగా ఆడియన్స్ ముందుకు లాస్ట్ ఇయర్…
హిందీలో భారీ హోప్స్ పెట్టుకున్న ఛత్రపతి హిందీ రీమేక్ కూడా అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో తిరిగి టాలీవుడ్ కే వచ్చేసిన బెల్లంకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భీమ్లా నాయక్(Bheemla Nayak) మూవీతో 159 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో…
తన కొత్త సినిమాను అనౌన్స్ చేయగా రీసెంట్ గా సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ గ్లిమ్స్ ను బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. గ్లిమ్స్ చూస్తూ ఉంటే మరోసారి మాస్ కంటెంట్ తో బెల్లంకొండ కుమ్మేశాడు అనే చెప్పాలి. సినిమా కి డిఫెరెంట్ గా టైసన్ నాయుడు(Tyson Naidu Movie) అంటూ…
కొత్త టైటిల్ ను పెట్టగా ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ పోలిస్ గా కనిపించబోతున్నాడు, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ పరంగా మాస్ కంటెంట్ తో బాగానే ఉందీ అనిపించేలా మెప్పించింది. ఇక ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లోనే రాబోతున్న ఈ సినిమాతో బెల్లంకొండ మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.