టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తీ చేసుకుంది, సినిమా 2 వారాల్లో టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 103 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా 137.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇప్పుడు మూడో వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 400 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసింది.
కాగా 3 వ వారం మొదటి రోజు కూడా వర్కింగ్ డే అవ్వడం తో సినిమా మరింత షాక్ ఇచ్చేలా డ్రాప్స్ ని సాధించింది, 14 వ రోజు తో పోల్చితే 15 వ రోజు కూడా 30% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి కొంచం కోలుకున్నా…
ఓవరాల్ గా 25% డ్రాప్స్ 14 వ రోజు తో పోల్చితే 15 వ రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో దక్కాయి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా యావరేజ్ గా ఉండటం తో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే…
మొత్తం మీద 55 లక్షలకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది, టార్గెట్ పెద్దది అవ్వడం తో ఇది సరిపోదు అనే చెప్పాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 70 లక్షల నుండి 75 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా వీకెండ్స్ లో కుమ్ముతున్నా..
వర్కింగ్ డేస్ లో మాత్రం చాలా స్లో డౌన్ అవుతుంది అన్నది సత్యం. తెలుగు వర్షన్ వరకు సినిమా అద్బుతాలు సృష్టించినా అన్ని వర్షన్స్ తో కలిపి చూస్తె సినిమా భారీ షాక్ లే ఇచ్చింది అని చెప్పాలి. ఇక 15 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి…