Home న్యూస్ ఖిలాడి@1600….కెరీర్ బెస్ట్ రికార్డ్ ఇది!!

ఖిలాడి@1600….కెరీర్ బెస్ట్ రికార్డ్ ఇది!!

0

క్రాక్ సినిమా తో కెరీర్ బెస్ట్ హిట్ ని కంబ్యాక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన రవితేజ తర్వాత చేసిన సినిమా ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధం అవుతుంది, మరి కొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది అని చెప్పాలి. రవితేజ నటించిన క్రాక్ మూవీ….

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినప్పుడు వరల్డ్ వైడ్ గా 1100 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది, కాగా ఇందులో తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ థియేటర్స్ ఉండగా ఇప్పుడు ఇతర సినిమాలు కూడా రిలీజ్ కి ఉండటంతో తెలుగు రాష్ట్రాలలో…

కౌంట్ కొంచం తగ్గినా కానీ ఓవరాల్ గా బిగ్గెస్ట్ రిలీజ్ నే సినిమా సొంతం చేసుకుంటుంది, హిందీలో కూడా భారీగానే సినిమా రిలీజ్ అవుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్కలను  ఒకసారి ఏరియాల వారిగా గమనిస్తే….

👉Nizam: 273
👉Ceeded: 150
👉UA: 101
👉East: 57
👉West: 40
👉Guntur: 45
👉Krishna: 49
👉Nellore: 40
TOtal AP TG: 760+
👉Ka+ROI – 140+
👉Hindi – 500+
👉Os – 200+
Total WW: – 1600+
ఇదీ ఖిలాడి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న ఏరియాల వారి థియేటర్స్ కౌంట్ లెక్క. రవితేజ కెరీర్ లోనే ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పాలి…. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద….

24.80 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 25.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా ఈ రేంజ్ థియేటర్స్ లో ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కచ్చితంగా మాస్ ఓపెనింగ్స్ ని దక్కించుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. అవి ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here