Home గాసిప్స్ 164 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టినా కొత్త సినిమా కి హీరో దొరకడం లేదు!!

164 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టినా కొత్త సినిమా కి హీరో దొరకడం లేదు!!

0

ఫాం అనేది శాశ్వతం కాదు, ఫాం లో ఉన్నప్పుడు హిట్స్ పడటం ఫాం కోల్పోయాక ఆఫర్స్ ఆగిపోవడం సర్వసాధారణంగా జరిగేవే… టాలీవుడ్ లో డైరెక్టర్స్ పరంగా ఒకప్పుడు టాప్ ప్లేస్ లో తర్వాత టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు వి వి వినాయక్ ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసి రాజమౌళి తర్వాత ప్లేస్ ని సొంతం చేసుకున్న వినాయక్ రీసెంట్ టైం లో అసలు ఫాం లో లేడు….

2013 లో నాయక్ సినిమా తో సూపర్ హిట్ కొట్టినా తర్వాత నుండి తన డౌన్ ఫాల్ మొదలు అయింది, అల్లుడు శీను హిట్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ ఫ్లాఫ్ అయింది. ఇక తర్వాత అఖిల్ లాంచింగ్ మూవీ అఖిల్ ఆల్ టైం డిసాస్టర్ అయ్యింది.

ఇలాంటి టైం లో మెగాస్టార్ పిలిచి మరీ కత్తి రీమేక్ ని చేతిలో పెట్టగా అవుట్ పుట్ యావరేజ్ గా వచ్చినా చిరు కంబ్యాక్ వల్ల ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 164 కోట్లకి పైగా గ్రాస్ తో సంచలనం సృష్టించింది కానీ తర్వాత చేసిన ఇంటెలిజెంట్ తో కెరీర్ ఆల్ టైం డిసాస్టర్ కొట్టి ఖాళీ అయిపోయాడు వినాయక్.

దాంతో డైరెక్టర్ గా వద్దని హీరోగా చేద్దామని ట్రై చేసిన సీనయ్య సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. చిరు తో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాథర్ ఛాన్స్ దొరికినట్లే దొరికి చేయి జారిపోయింది… ఆ సినిమా వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది… ఇలాంటి టైం లో మళ్ళీ తిరిగి డైరెక్టర్ గానే పని చేయాలి అని ఇప్పుడు హీరో ని వెతికే పనిలో ఉన్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు వినాయక్ సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్స్ గా ట్రేడ్ లో మంచి క్రేజ్ ఉండేది…

కానీ రీసెంట్ టైం లో చాలా స్లో అయిపోయి ఎందుకనో మిగిలిన డైరెక్టర్స్ రేసులో చాలా వెనుకబడిపోయాడు వినాయక్. ఇంటెలిజెంట్ డిసాస్టర్ రిజల్ట్ వచ్చి చాలా ఏళ్ళు గడచినా కూడా  ఇప్పటి వరకు కొత్త సినిమా దక్కలేదు వినాయక్ కి, హీరోల డేట్స్ కోసం ట్రై చేస్తున్నా ఎవ్వరూ ఖాళీగా లేరు. ఇలాంటి టైం లో మీడియం రేంజ్ హీరోల తో అయినా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు వినాయక్. మరి ఇదైనా జరుగుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here