Home గాసిప్స్ హిందీ ఛత్రపతికి వివి వినాయక్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

హిందీ ఛత్రపతికి వివి వినాయక్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఫస్ట్ హిందీ మూవీ ఛత్రపతి తనకి హిందీలో మంచి లాంచ్ పాడ్ లా నిలుస్తుంది అనుకున్నా కూడా సినిమాకి అక్కడ ఆశించిన రెస్పాన్స్ అస్సలు రాలేదు…యాక్షన్ సీన్స్ బాగానే ఇంప్రెస్ చేసినా కూడా ఆడియన్స్ కేరళ స్టొరీ జోరు ముందు ఈ సినిమాను పట్టించుకోలేదు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది.

ఇక సినిమా భారీ ఎత్తున బడ్జెట్ తో తెరకెక్కగా బడ్జెట్ పరంగా చూసుకుంటే అందులో 5% రికవరీని కూడా సొంతం చేసుకోలేక పోయింది. ఇలాంటి సినిమాకి హిందీలో రెమ్యునరేషన్ పరంగా బెల్లంకొండ శ్రీనివాస్ 8.5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకున్నట్లు వార్తలు రాగా…

ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన వివి వినాయక్ చేయగా ఈ సినిమా పై కూడా వినాయక్ ఆశలను భారీగానే పెట్టుకున్నాడు, వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న వినాయక్ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ని ఎక్స్ పెర్ట్ చేసినా కూడా సినిమా నిరాశనే మిగిలించింది అని చెప్పాలి. కానీ ఈ సినిమాకి వినాయక్ కి కూడా…

మంచి అమౌంట్ నే రెమ్యునరేషన్ కింద తీసుకున్నట్లు బాలీవుడ్ ట్రేడ్ లో సమాచారం. ఆల్ మోస్ట్ 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ దాకా రెమ్యునరేషన్ ని వినాయక్ ఈ సినిమా కి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా పై మొత్తం మీద భారీ ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి వినాయక్ కి నిరాశనే మిగిలించింది. ఇక ఇద్దరు ఫ్యూచర్ లో ఎలాంటి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here