బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా చాలానే ఉండగా ఆ మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల నుండే అందుకోవాల్సిన….
అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా 16వ రోజు నుండి వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో సినిమా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో కొద్ది వరకు హోల్డ్ ని పోటి లో ఉన్న ఇతర సినిమాలను తట్టుకుని పరుగును కొనసాగిస్తుంది..
హిందీ లో లాంగ్ రన్ వస్తుంది అనుకున్నా కూడా అక్కడ వచ్చిన ఎక్స్ ట్రీం ట్రోల్స్ అండ్ ఈ వీక్ లో రిలీజ్ అయిన కొత్త సినిమాల వలన సినిమా థియేటర్స్ చాలా వరకు తగ్గిపోయాయి. సినిమా ఇక తెలుగు లోనే ఎక్కువ వసూళ్ళని అందుకోవాల్సిన అవసరం ఉంది.
సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 16వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా మొత్తం మీద 16 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్క ఇదే విధంగా ఉంటుందా లేక ఏమైనా పెరుగుదల ఉంటుందో చూడాలి.