Home న్యూస్ 3rd డే SPY-సామజవరగమనా కలెక్షన్స్…ఈ రోజు 2 సినిమాలు కుమ్ముతున్నాయి!!

3rd డే SPY-సామజవరగమనా కలెక్షన్స్…ఈ రోజు 2 సినిమాలు కుమ్ముతున్నాయి!!

0

ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) నటించిన స్పై(SPY Movie) మరియు శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన సామజవరగమనా (Samajavaragamana) సినిమాలు భారీగానే రిలీజ్ అవ్వగా రెండు సినిమాల్లో సామజవరగమనా మంచి టాక్ తో…

జోరును చూపించగా నిఖిల్ స్పై మూవీ టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ రెండో రోజు పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. ఇక రెండు సినిమాలు మూడో రోజు వీకెండ్ లో అడుగు పెట్టగా సామజవరగమనా సూపర్బ్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుంది.

ఇక స్పై మూవీ మరోసారి పర్వాలేదు అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేస్తూ ఉండగా ఆల్ మోస్ట్ రెండో రోజుతో పోల్చితే సినిమా మూడో రోజు ఇప్పుడు 20% రేంజ్ లో డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఉండగా సామజవరగమనా ఆల్ మోస్ట్ రెండో రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతుంది.

దాంతో ఇప్పుడు సామజవరగమనా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 80 లక్షల నుండి కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా స్పై మూవీ ఈ రోజు బాక్స్ అఫీస్ దగ్గర 1.1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

రెండు సినిమాలు మంచి కలెక్షన్స్ తోనే 3వ రోజున జోరు చూపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సామజవరగమనా ఈ రోజు కోటిన్నర రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా స్పై మూవీ ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చు. సామజవరగమనా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎక్స్ లెంట్ గా ఉండటంతో ఈ అంచనాలను కూడా మించిపోవచ్చు. ఇక 2 సినిమాల అఫీషియల్ 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here