Home న్యూస్ 17 వ రోజు ఓపెనింగ్స్…బ్యాటింగ్ మొదలు !

17 వ రోజు ఓపెనింగ్స్…బ్యాటింగ్ మొదలు !

0

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ మొత్తం మీద 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 95.72 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు 17 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి సోమవారం రోజు లెవల్ లో ఓపెన్ అయింది. దాంతో ఈ రోజు వసూళ్లు 16 వ రోజు తో పోల్చితే చాలా బెటర్ గా ఉండే ఛాన్స్ ఉంది.

రెండు రాష్ట్రాలలో 16 వ రోజు తో పోల్చితే 17 వ రోజు ఓపెనింగ్స్ 20% కన్నా ఎక్కువ గ్రోత్ ని చూపాయి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజు 50 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల లో సాధించే గ్రోత్ ని బట్టి ఎంత దూరం వెళుతుందో తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here