Home గాసిప్స్ చస్….14.5 కోట్లు…సూపర్ స్టార్ ఊచకోత!

చస్….14.5 కోట్లు…సూపర్ స్టార్ ఊచకోత!

0

  సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను తో బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించగా ఇప్పుడు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరి కీ తెలిసిందే.

కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని రీసెంట్ గా జెమినీ టీవి వారు కొనగా రేటు ఎంత అనేది క్లియర్ గా తెలియరాలేదు, కానీ ఇప్పుడు తెలుగు వర్షన్ కి గాను ఈ సినిమా శాటిలైట్ రైట్ హక్కులు 14.5 కోట్ల రికార్డ్ లెవల్ రేటు కి అమ్ముడు పోయినట్లు సమాచారం.

ఇంకా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పలుకుతున్నట్లు సమాచారం. ఈ సమ్మర్ కి భరత్ అనే నేను తో దుమ్ము లేపి రెండు వరుస ఫ్లాఫ్స్ తర్వాత కూడా రికార్డులు బ్రేక్ చేసిన మహేశ్ వచ్చే సమ్మర్ కి 25 వ సినిమా తో ఎలాంటి సెంసేషన్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here