బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ రెండు వారాలను పూర్తి చేసుకుని మోడో వీక్ లో ఎంటర్ అయినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోతుంది. ఎట్టకేలకు 17వ రోజున సినిమాకి సండే అలాగే రిపబ్లిక్ డే హాలిడే లు కలిసి రావడంతో ఎంతో కొంత బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉంది కలెక్షన్స్ పరంగా..
మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో మేజర్ ఏరియాల్లో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ఉండగా ఈ రోజు సినిమాకి పర్వాలేదు అనిపించేలా షేర్ సొంతం అయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన మేజర్ సెంటర్స్ ను బట్టి చూస్తుంటే సినిమా మొత్తం మీద…
22-25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ లెక్కలు కనుక కొంచం అంచనాలను మించితే 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ సినిమాకి కొద్ది వరకు ఉంది. ఇక సినిమా మిగిలిన చోట్ల పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోతుంది…
దాంతో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజున సినిమా 28-30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీ లో ఏమైనా షేర్ నమోదు అయితే 32-35 లక్షల దాకా వెళ్ళే అవకాశం కొద్ది వరకు ఉంటుంది. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా…
ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి…అయినా కూడా ఉన్నంతలో ఎంతో కొంత షేర్స్ తో నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న గేమ్ చేంజర్ మిగిలిన రన్ లో ఇక ఔట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక టోటల్ గా 17 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.