బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో కొత్త సినిమాలు పోటిలో ఉన్నప్పటికీ కూడా యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఉన్నంతలో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఉండటం విశేషం..
ఈ రోజు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా మేజర్ సెంటర్స్ లో తండేల్ మూవీ మంచి హోల్డ్ నే చూపించింది. ఆల్ మోస్ట్ 16వ రోజు మీద ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా 20% రేంజ్ లో గ్రోత్ ని అయితే చూపించిన సినిమా ఆఫ్ లైన్ లో కూడా..
ఇదే రేంజ్ లో గ్రోత్ ని అయితే చూపించే అవకాశం ఎంతైనా ఉండగా ఉన్నంతలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల షేర్ మార్క్ ని దాటేసి ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 55 లక్షల రేంజ్ కి చేరువ అయ్యే అవకాశం ఉండగా….
మ్యాచ్ వలన నైట్ షోలకు పెద్దగా ఇబ్బంది లేకుంటే ఇంకా షేర్ పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల ఆవల పెద్దగా జోరు చూపించ లేక పోతుంది కనుక వరల్డ్ వైడ్ గా సినిమా 17వ రోజున ఇప్పుడు 55 లక్షలు ఆ పైన షేర్ ని..
సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ 1.1 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. అన్ సీజన్ లో పోటిలో ఓవరాల్ గా ఇవి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. మరి సినిమా ఈ రోజు ఈ అంచనాలను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో షేర్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.