బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి పెద్ద హీరోల సినిమాల పరంగా ఓ బిగ్ హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తుండగా రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ షంషేర సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా తొలిరోజు నుండే కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ చూపలేదు…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో 31 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా సినిమా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మినిమమ్ ఇంపాక్ట్ ని చూపలేదు. దాంతో మొత్తం మీద సినిమా వర్కింగ్ డేస్ లో 9 కోట్ల నెట్ కలెక్షన్స్ ని మాత్రమే అందుకుంది.
దాంతో టోటల్ గా మొదటి వారానికి గాను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 40 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. సినిమా బడ్జెట్ 180 కోట్లు కాగా ఆ బడ్జెట్ దృశ్యా సినిమా బిగ్గెస్ట్ డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది అని చెప్పాలి.