Home న్యూస్ బాలీవుడ్ మూవీస్ లో AP-TG లో రికార్డ్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలు ఇవే!

బాలీవుడ్ మూవీస్ లో AP-TG లో రికార్డ్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలు ఇవే!

0

తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఇతర భాషల డబ్బింగ్ మూవీస్ కలెక్షన్స్ పరంగా సంచలనాలు సృష్టించేవి, కానీ రీసెంట్ టైంలో హిందీ మూవీస్ కూడా ఇక్కడ ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం,  2023 ఇయర్ లో వరుస పెట్టి కొన్ని హిందీ సినిమాలు తెలుగు లో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకున్నాయి…

2023 ఇయర్ మొదట్లో షారుఖ్ నటించిన పఠాన్ మూవీ తర్వాత  వచ్చిన జవాన్(Jawan Movie) రికార్డ్ కలెక్షన్స్ ని ఈ సినిమా బ్రేక్ చేసి దుమ్ము లేపింది. ఇయర్ ఎండ్ లో  వచ్చిన యానిమల్(Animal Movie) మొదటి రోజున… తెలుగు రాష్ట్రాల్లో ఏ హిందీ సినిమా సాధించని రేంజ్ లో ఊచకోత కోస్తూ 15.45 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ఓపెనింగ్ డే గ్రాస్ ను సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది, 

ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే… 
1st Day Top Bollywood Movies Collections in Telugu States
👉#Animal – 15.45CR Gross*****
👉#Jawan – 9.35CR
👉#Brahmastra – 6.70CR
👉#Pathaan – 6.50CR~
👉#TIGER3 – 5.85CR~
👉#Dhoom3- 4.70CR

రణబీర్ కపూర్(Ranbir Kapoor) రీసెంట్ టైంలో బాక్ టు బాక్ మూవీస్ తో రచ్చ చేయగా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 2 సినిమాలతో దుమ్ము లేపాడు, యానిమల్ మూవీ నెలకొల్పిన రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. బహుశా యానిమల్2 కి ఆ ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. కానీ 2024 ఇయర్ లో కొన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ కానున్నాయి. వాటిలో ఏవైనా సినిమాలు ఈ లిస్టులో ఎంటర్ అవుతాయో లేవో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here