ఒక సినిమా భారీ హిట్ ఇంపాక్ట్ కొత్త సినిమా మీద కచ్చితంగా ఉంటుంది… ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచిన సినిమా కార్తికేయ2. హిందీలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర…
120 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంది. అలాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా తర్వాత నిఖిల్ చేసిన 18 పేజెస్ సినిమా సుకుమార్ కథ అందించగా కుమారి 21F లాంటి హిట్ కొట్టిన డైరెక్టర్…
సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రాగా సినిమా పై అనుకున్న రేంజ్ లో బజ్ అయితే లేదనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి అని చెప్పాలి. సినిమా క్రేజీ కాంబినేషన్ లో తెరకేక్కినా కానీ ప్రస్తుతానికి బజ్ అండ్ బుకింగ్స్ బిలో యావరేజ్ గానే ఉండటంతో…
సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతూ ఉండగా పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాక్ బాగుంటే సినిమా కలెక్షన్స్ పరంగా షో షో కి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.