బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ అనుపమల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా కానీ నిఖిల్ నటించిన కార్తికేయ2 సినిమాతో పోల్చితే మట్టుకు ఓపెనింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వాల్యూ బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. కానీ అదే టైం లో సినిమా ఓవరాల్ బడ్జెట్ మీద….
నిర్మాతలకు లాభాలను తెచ్చిందా లేదా అంటే మాత్రం మంచి లాభాలనే సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి. సినిమా ను మొత్తం మీద 16 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించారట. ఇక సినిమాకి టోటల్ గా డిజిటల్, శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్…
అన్నీ కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఏకంగా 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందట. దాంతో బడ్జెట్ మీద ఇక్కడే సినిమా కి 6 కోట్ల ప్రాఫిట్ సొంతం అవ్వగా థియేట్రికల్ రన్ బోనస్ అని చెప్పొచ్చు. కానీ సినిమా బడ్జెట్ అండ్ నిఖిల్ ప్రీవియస్ మూవీ బిజినెస్ రేంజ్ తో కంపేర్ చేసి…
ఇప్పుడు రిలీజ్ అయిన 18 పేజెస్ వాల్యూ బిజినెస్ టార్గెట్ 12.50 కోట్ల రేంజ్ లో అందుకోవాల్సి ఉంటుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మార్క్ ని అందుకుంటే ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ పద్దతిలో సినిమా హిట్ అని చెప్పొచ్చు, లేక పోయినా మేకర్స్ కి సూపర్బ్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన ఈ సినిమా వాళ్ళకి హిట్ అయినా వాల్యూ టార్గెట్ ప్రకారం ఇంకా కష్టపడాల్సి ఉంటుంది.