బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ 91 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా మూడో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టింది. సినిమా 17వ రోజున సండే అడ్వాంటేజ్ తో ఉన్నంతలో..
మంచి హోల్డ్ నే చూపించగా 18వ రోజున ఫుల్ వర్కింగ్ డే లో అడుగు పెట్టిన సినిమా ఓవరాల్ గా డ్రాప్స్ ను హెవీ గానే సొంతం చేసుకున్న సినిమా….అనుకున్న దాని కన్నా కూడా డ్రాప్స్ ఇంకా ఎక్కువగానే సొంతం చేసుకుంది ఈ రోజున…
దాంతో కలెక్షన్స్ పరంగా ఈ రోజు నుండి సినిమా చాలా వరకు స్లో డౌన్ అవ్వగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 16-18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే…
షేర్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మాత్రం స్లో డౌన్ అయిన సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా… ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్….
కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ 40 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద ఇక వర్కింగ్ డేస్ లో సినిమా రన్ మరింత స్లో కానుండగా శివరాత్రి హాలిడే రోజున కొంచం జోరు చూపించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 18 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.