కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి లాంగ్ 5 డేస్ ఎక్స్ టెండేడ్ వీకెండ్ ను పూర్తీ చేసుకుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా అన్ని వర్షన్ లు కలిపి ఎలాంటి కలెక్షన్స్ ని సాధించింది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.
సినిమా మొదటి 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఇప్పుడు బయటికి వచ్చాయి. సినిమా మొత్తం మీద 50% లిమిటేషన్ లు ఉన్నా కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇండియా తరుపున బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని పాండమిక్ తర్వాత సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.
సినిమా బాక్స్ అఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Tamilnadu – 83Cr
Telugu States- 20.20Cr
Karnataka- 13.51Cr
Kerala – 8.6Cr
ROI – 4.5Cr
Total India – 129.81Cr
USA/CA – 2.45Cr
AUS – 3.85Cr
NZ – 64L
UAE-GCC – 14.3Cr
ROW – 7Cr
Total collection – 158.05Cr Approx
ఇక సినిమా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Tamilnadu – 49Cr
Telugu States- 11.76Cr
Karnataka- 5.6Cr
Kerala – 4.22Cr
ROI – 2.45Cr
Total India – 73.03Cr
USA/CA – 1.20Cr
AUS – 1.94Cr
NZ – 30L
UAE-GCC – 8.2Cr
ROW – 3.4Cr
Total collection – 88.07Cr Approx
ఇదీ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలు. మొత్తం మీద దుమ్ము దుమారం చేసే కలెక్షన్స్ ని సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. సినిమా టోటల్ బిజినెస్ 104.25 కోట్లు కాగా టోటల్ బ్రేక్ ఈవెన్ కి 190 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉండగా 5 రోజుల్లో 158 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు మిగిలిన రన్ లో మరో 32 కోట్లకు పైగా గ్రాస్ ను అలాగే 17 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది. మొదటి వారం లేదా రెండో వీక్ లో సినిమా ఈ మార్క్ ని అందుకోవడం ఖాయంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు.