Home న్యూస్ 190 కోట్ల జాతర….రికార్డుల తుక్కు రేగ్గొట్టిన రెబల్ స్టార్!!

190 కోట్ల జాతర….రికార్డుల తుక్కు రేగ్గొట్టిన రెబల్ స్టార్!!

0

3 నెలల అన్ సీజన్ తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యి ఇప్పుడు సంచలనం సృష్టించడం విశేషం…. సినిమా మొదటి రోజు అనుకున్న అంచనాలను మించే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు మొదటి రోజు 75 కోట్ల రేంజ్ నుండి 80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో మాత్రం రచ్చ చేసిన సినిమా అక్కడ నుండే ఈజీగా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ లెక్కలు కనుక బాగుంటే ఈ మార్క్ ని కూడా సినిమా దాటవచ్చు….

ఇక కర్ణాటకలో 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉన్న సినిమా, తమిళ్, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు అందుకునే అవకాశం ఉంది… దాంతో టోటల్ గా ఇండియాలో సినిమా మొదటి రోజున 120 కోట్ల నుండి అన్నీ….

అనుకున్నట్లు జరిగితే 125 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో సినిమా 60-65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాంతో మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 190 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సినిమా ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్లా అంచనాలను కనుక మించిపోతే ఈ అనుకున్న మార్క్ ని కూడా సినిమా మించే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది…మరి మొత్తం మీద మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ పరంగా సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకోబోతుండగా ఈ మార్క్ ని కూడా దాటేసి 200 కోట్లు ఆ పైన కనుక సొంతం చేసుకుంటే వీకెండ్ లో ఓ రేంజ్ లో భీభత్సం సృష్టించే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here