పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ పేరిట ఇది నిజంగానే బ్యాడ్ రికార్డ్ అని చెప్పాలి. క్లాస్ లవ్ స్టొరీ కోసం ఏకంగా 300 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించిన రాధే శ్యామ్ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా ఆ అంచనాలను సినిమా చాలా వరకు అందుకోలేక పోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర… దాంతో తొలి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలోకూడా…
ఇక తేరుకోలేక పోయింది… వీకెండ్ వరకు ఎలాగోలా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో మాత్రం అసలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది… అది నెక్స్ట్ లెవల్ కి వెళ్ళేలా ఇప్పుడు…
రెండు తెలుగు రాష్ట్రాలలో రీసెంట్ టైం లో స్టార్ హీరోల సినిమాల పరంగా కేవలం 5 రోజులు మాత్రమే ప్రతీ రోజూ కోటి కి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని లోవేస్ట్ కోటి రేంజ్ ని అందుకున్న సినిమాగా కూడా నిలిచి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది ఈ సినిమా….. 6 వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల…
కలెక్షన్స్ కోటి మార్క్ ని కూడా అందుకోలేక పోవడం ఈ రేంజ్ బడ్జెట్, భారీ టికెట్ హైక్స్ ఇవన్నీ ఉన్నా కానీ మినిమమ్ కోటి రేంజ్ షేర్ ని కూడా సాధించక పోవడం తీవ్ర విచారకరమైన విషయం అనే చెప్పాలి. ప్రభాస్ నటించిన ప్రీవియస్ మూవీ సాహో డిసాస్టర్ టాక్ తో కూడా 7 రోజుల పాటు అయినా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుంది…
కానీ రాధే శ్యామ్ మాత్రం 5 రోజుల తోనే సరిపెట్టుకుంది… అంటే ఏ రేంజ్ లో ఆడియన్స్ నుండి ఈ సినిమా విముఖతని సొంతం చేసుకుంది అన్న దానికి ఇది బెస్ట్ ఉదాహరణ గా చెప్పొచ్చు… ఇక ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి… ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ తో ఊహకందని కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది….