ఒక సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఆ సినిమా లాంగ్ రన్ ని సొంతం చేసుకోవాలి అంటే మంచి పాజిటివ్ టాక్ ఎంత అవసరమో అదే టైంలో ఆ సినిమా లాంగ్ రన్ లో ఎంత జోరుగా హోల్డ్ ని చూపించింది అన్నది కూడా అంతే అవసరం అని చెప్పాలి…. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఎన్నేసి సెంటర్స్ లో…
ఆడింది అన్నది గొప్పగా చెప్పేవాళ్ళు కానీ తర్వాత అది రెండు మూడు వారాలకే పరిమితం అవుతూ ఉండగా, ఈ గ్యాప్ లో ఎన్ని రోజులు కంటిన్యూగా కోటికి తగ్గకుండా షేర్ ని మన సినిమాలు సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్నాయి అన్నది కూడా ముఖ్యంగా మారింది…
లాస్ట్ ఇయర్ టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ లో మూడు సినిమాలు ఎక్స్ లెంట్ రన్ ను సొంతం చేసుకున్నాయి. ఓవరాల్ గా ఏడున్నర ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఎపిక్ ఇండియన్ బ్లాక్ బస్టర్ బాహుబలి2 సినిమా 28 రోజుల పాటు నాన్ స్టాప్ గా…
కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని కుమ్మేసింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన పుష్ప2 మూవీ 26 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని టాప్ 2 ప్లేస్ తో మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా టాలీవుడ్ లో ఎక్కువ రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
Top AP TG 1cr Plus Continuous Share Movies(All Time)
👉#Baahubali2 – 28 Days
👉#Pushpa2TheRule – 26 Days(Inc premieres)💥💥💥💥
👉#Baahubali – 20 Days
👉#HanuMan – 20 Days(Inc premieres)
👉#Devara – 19 Days
👉#AlaVaikunthapurramuloo – 17 Days
👉#RRRMovie – 17 Days
👉#F2 – 16 Days
👉#Rangasthalam – 14 Days
👉#Maharshi – 14 Days
👉#SyeRaa – 13 Days
👉#SarileruNeekevvaru – 13 Days
👉#Kalki2898AD – 13 Days
మొత్తం మీద ఈ సినిమాలు టాలీవుడ్ హిస్టరీలోనే ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోశాయి… ఓవరాల్ గా ఏడున్నర ఏళ్ళుగా టాప్ లో ఉన్న బాహుబలి2 మూవీ రికార్డ్ రన్ ను ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా అయినా అందుకుంటుందో లేదో చూడాలి ఇక…