Home న్యూస్ ఇండియాలో ఫస్ట్ 150 కోట్ల సినిమా…17 ఏళ్ల ఎపిక్ రికార్డ్ ఇదీ!

ఇండియాలో ఫస్ట్ 150 కోట్ల సినిమా…17 ఏళ్ల ఎపిక్ రికార్డ్ ఇదీ!

0

ఇప్పుడంటే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ టికెట్ హైక్స్ పుణ్యాన రిలీజ్ అయిన మొదటి రోజే కొన్ని సినిమాలు ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధ్యం అవుతున్నాయి కానీ ఒకప్పుడు ఇలాంటివి లేవు, ఒక సినిమా లాంగ్ రన్ లో కూడా ఈ మార్క్ ని అందుకోవడానికి ఏళ్ళకి ఏళ్ళు టైం పట్టింది. ఇండియన్ సినిమాలలో 150 కోట్ల గ్రాస్ మార్క్ ని ఇండియా లోనే సొంతం చేసుకున్న మొట్ట మొదటి సినిమా…

సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందిన శివాజీ సినిమా. 2007 లో జూన్ 15 న రిలీజ్ అయిన ఈ సినిమా సౌత్ ఇండియా ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది. కోలివుడ్ తరుపునే కాకుండా ఇండియా తరుపున కూడా…

ఫుల్ ఫ్లెట్చుడ్ ఫస్ట్ 150 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది, తెలుగు లో కూడా అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుండే 2007 టైం లోనే ఏకంగా 18 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది.

అలాంటి విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి నేటితో 17 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం, సౌత్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 76 కోట్ల రేంజ్ లో షేర్ ని టోటల్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 151 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

తెలుగు రాష్ట్రాలలో 50 రోజులను 39 డైరెక్ట్ సెంటర్స్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీ లో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ ని సాధించి సత్తా చాటుకుంది. రజినీ బాక్స్ ఆఫీస్ స్టామినా ని నిరూపించిన ఈ సినిమా రోబో రూపొందేలా చేయడానికి మంచి పునాది వేసింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here