బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకోగా పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. సినిమా నైజాంలో పర్వాలేదు అనిపించినా….
ఆంధ్ర అండ్ సీడెడ్ లో యావరేజ్ గానే నిలిచింది. మొత్తం మీద బుకింగ్స్ ని బట్టి చూస్తె తొలిరోజు సినిమా 50-60 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఫైనల్ లెక్క మొత్తం మీద…
75 నుండి 80 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం మీద చాలా సినిమాల పోటిలో రిలీజ్ అయినా కానీ ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఒకవేళ ఈ లెక్కకి మించి కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుంటే ఓ మంచి స్టార్ట్ ను సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర, మరి అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.