కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ బుకింగ్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా అయితే జరగలేదు, దాంతో రిలీజ్ రోజు టాక్ పైనే డిపెండ్ అయిన బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ షోల టైం కి…
ఆక్యుపెన్సీ నైజాంలో తక్కువగానే ఉన్నప్పటికీ కూడా మ్యాట్నీ షోల నుండి పుంజుకోవడం మొదలు పెట్టిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ తో దూసుకు పోయి మొదటి రోజు ఇప్పుడు నైజాంలో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే….
అవకాశం ఉండగా సినిమా ఆంధ్ర రీజన్ లో మార్నింగ్ షోల నుండే దుమ్ము లేపగా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపింది. సీడెడ్ ఏరియాలో కూడా సినిమా సాలిడ్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది… కానీ కొన్ని చోట్ల మరీ అనుకున్న రేంజ్ లో అయితే ఫుల్స్ పడలేదు కానీ ఆక్యుపెన్సీ మాత్రం…
సాలిడ్ గానే ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు రావాల్సి ఉండగా సినిమా మొత్తం మీద 6.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు…. ఇక సినిమా…
టోటల్ వరల్డ్ వైడ్ గా 7.5 కోట్లకి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక కొన్ని చోట్ల హైర్స్ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉండటంతో ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. మరి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఈ రేంజ్ ని మించుతుందా లేక తగ్గుతుందో చూడాలి.