బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ బెల్ బాటం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమా లాస్ట్ ఇయరే షూటింగ్ మొత్తం పూర్తీ చేసుకున్నా కానీ ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు, కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ ఆగిపోగా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి సెన్సేషనల్ OTT డీల్స్ ఈ సినిమా కి వచ్చాయి.
కానీ వాటికి నో చెప్పిన అక్షయ్ కుమార్ రిస్క్ చేసి మరీ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇండియా వైడ్ గా 2000 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా చాలా చోట్ల టికెట్స్ బుక్ అవ్వకపోవడం తో షోలు కాన్సిల్ చేశాయి.
అయినా కానీ మిగిలిన థియేటర్స్ లో ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా జరగడం తో ఓవరాల్ బుకింగ్స్ తో సినిమా 2 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అప్పటికే సొంతం చేసుకునే అవకాశం ఉందని అనుకోగా సినిమా టాక్ కూడా పాజిటివ్ గా ఉండటం తో సినిమా ఇక…
మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 6-8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇండియా వైడ్ గా దారుణమైన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. కేవలం 2.65 కోట్ల నెట్ కలెక్షన్స్ ని మాత్రమె సొంతం చేసుకుని తీవ్ర నిరాశ పరిచింది.
బాలీవుడ్ పరిస్థితి ఏమాత్రం తేరుకొలేదని ఈ సినిమా ఓపెనింగ్స్ తో కన్ఫాం అయింది. మౌత్ టాక్ అంత పాజిటివ్ గా ఉన్నా జనాలు థియేటర్స్ లోకి రాక పోవడం విచారకరం. ఈ లెక్కన పెద్ద సినిమాలు ఇప్పట్లో రిలీజ్ లను ప్లాన్ చేసుకునే అవకాశం తక్కువే అని చెప్పాలి. ఇక వీకెండ్ లో అయినా ఏమైనా గ్రోత్ ని సినిమా చూపెడుతుందో చూడాలి.