Home న్యూస్ 24 గంటలు ఓవర్…రెస్పాన్స్ అదిరిపోయిందిగా!

24 గంటలు ఓవర్…రెస్పాన్స్ అదిరిపోయిందిగా!

0

కెరీర్ లో చాలా కాలం నుండి నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో సుధీర్ బాబు కూడా ఒకరు, కెరీర్ లో ఇప్పటికి చాలా సినిమాలు చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేమ కథా చిత్రం తర్వాత మళ్ళీ అలాంటి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు, మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసినా కానీ ఎప్పుడూ సరైన సినిమా పడలేదు. ఇలాంటి టైం లో ఇప్పుడు రీసెంట్ గా….

పలాసా డైరెక్టర్ తో కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తో వచ్చే వారం ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా పై ట్రేడ్ లో డీసెంట్ బజ్ నెలకొంది. మణిశర్మ అందించిన సాంగ్స్ కి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి…

బాగానే వస్తూ ఉండటం తన కెరీర్ లో మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. కాగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం విశేషం, రెస్పాన్స్ మాస్ ఆడియన్స్ వరకు రీచ్ అవ్వగా సినిమా ట్రైలర్ తో…

సుధీర్ బాబు కూడా మంచి మార్కులు కొట్టేశాడు. దాంతో ఇప్పుడు సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ కి ఓవరాల్ గా 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి వ్యూస్ 3.08 మిలియన్ వ్యూస్ మార్క్ ని లైక్స్ 157.6K లైక్స్ మార్క్ ని అందుకుని…

సాలిడ్ రెస్పాన్స్ ను దక్కించుకుని సుధీర్ బాబు కెరీర్ లో బెస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ట్రైలర్ గా నిలిచింది. ఈ రేంజ్ రెస్పాన్స్ తర్వాత సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల 27 న భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. మరి సినిమా కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here