యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ “90ML”… ఈ ఇయర్ ఇప్పటికే హిప్పీ అలాగే గుణ 369 సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ కి 2 సార్లు కూడా నిరాశనే మిగిలింది. ముఖ్యంగా పర్వాలేదు అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకున్న గుణ 369 సినిమా ఓవర్ బిజినెస్ వల్ల బిజినెస్ ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలాంటి టైం లో ప్రేక్షకుల ముందుకు “90ML” తో వచ్చాడు కార్తికేయ.
ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు టాక్ మిక్సుడ్ గా వచ్చింది, కానీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా టాక్ ఎఫెక్ట్ వలన ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా స్లో డౌన్ అయింది.
అయినా కానీ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 66 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసింది, ఇక వరల్డ్ వైడ్ గా 71 లక్షల షేర్ ని అందుకుంది “90ML” సినిమా. మొత్తం మీద ఏరియాల వారి మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
?Nizam: 22L
?Ceeded: 11L
?UA: 10L
?East: 6L
?West: 4L
?Guntur: 5L
?Krishna: 4.9L
?Nellore: 3.3L
AP-TG Total:- 0.66cr
Ka & ROI: 2L
OS: 3L
Total WW: 0.71CR(1.22cr Gross)
కాగా సినిమా బిజినెస్ వివరాలు ఇంకా క్లియర్ గా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ట్రేడ్ లెక్కల్లో సినిమా బిజినెస్ మొత్తం మీద…
4.5 కోట్ల రేంజ్ లో ఉందని అంచనా వేస్తున్నారు, దాంతో సినిమా ఆ లెక్కల్లో క్లీన్ హిట్ కి 5 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, మొదటి రోజు 71 లక్షల షేర్ తర్వాత మిగిలిన రన్ లో మరో 4.29 కోట్ల షేర్ ని సినిమా అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, మరి వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.