మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గని బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 530 కి పైగా థియేటర్స్ లో అలాగే వరల్డ్ వైడ్ గా 750 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. కాగా సినిమా కి ప్రెజెంట్ అంత బజ్ లేకున్నా కానీ ఓవరాల్ గా 25 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా…
26 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది… ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ స్టార్ట్ అయ్యి 3 రోజులకు పైగానే అవుతున్నా కానీ ఏమాత్రం బుకింగ్స్ ఆశించిన విధంగా అయితే లేవు అనే చెప్పాలి… దాంతో సినిమా ఇక మౌత్ టాక్ పైనే…
డిపెండ్ అయ్యి సినిమా రిలీజ్ అవ్వగా సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హైదరాబాదులో 50 లక్షలకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల టైం కి 20-25% రేంజ్ లో ఆక్యుపెన్సీ ఉందని చెప్పాలి ఓవరాల్ గా… సినిమా మొత్తం మీద ప్రజెంట్ బుకింగ్స్ తో మొత్తం మీద…
తెలుగు రాష్ట్రాలలో 1.6 కోట్ల రేంజ్ నుండి 1.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా రోజు గడుస్తున్న కొద్దీ షో షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయితే సినిమా 2 కోట్ల రేంజ్ నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, కానీ సినిమా బిజినెస్ దృశ్యా చూసుకుంటే మాత్రం ఈ ఓపెనింగ్స్ ఏమాత్రం టార్గెట్ ను…
అందుకునే అవకాశం కనిపించే అవకాశం లేదనే చెప్పాలి… కానీ నైట్ షోల టైం కి సినిమా ఏమైనా గ్రోత్ ని చూపించి ఇంతకు మించిన జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం…